‘ప్రగతి నివేదన యాత్ర’తో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన

నవతెలంగాణ-మంచాల
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన చేసేందుకే ‘ప్రగతి నివేదన యాత్ర’ ప్రారంభించినట్టు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ప్రగతి నివేదన యాత్ర బుధవారం 11వ రోజుకు చేరింది. ఈ యాత్రలో ప్రతి ఇంటికీ వెళ్లి,గ్రామాల్లో రోడ్లు,అండర్‌ డ్రయినేజీలు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను ఏ విధంగా చేరుతు న్నాయనీ,వాటిపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏర్పుల చంద్రయ్య, బీఆర్‌ఎస్‌ మండల అద్యక్షులు చీరాల రమేష్‌, ఎంపీపీ జటోత్‌ నర్మదాలచ్చిరాం, మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్‌ బహదూర్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ బూస్సు పుల్లారెడ్డి, బొద్ర మోనీ యాదయ్య, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ దండేటికార్‌ రవి, పీఎసీఎస్‌ మాజీ చైర్మెన్‌ మొద్దు సికిందర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు జంబుల కిషన్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ నర్సింగ్‌ వెంకటేష్‌ గౌడ్‌, పల్లె జంగారెడ్డి, మొగిలి వెంకటేష్‌, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ కంబాలపల్లి భరత్‌ కుమార్‌, సర్పంచ్‌లు అనిరెడ్డి జగన్‌ రెడ్డి, కుకుడాల శ్రీనివాస్‌రెడ్డి, బొడ్డు నాగరాజుగౌడ్‌, గోసుల జంగయ్య యాదవ్‌, పల్లాటి బాల్‌రాజ్‌, ఎంపీటీసీలు పేసరి గాయాల సుకన్య శేఖర్‌రెడ్డి, నర్సింగ్‌ అనిత వెంకటేష్‌ గౌడ్‌, ఏఎంసీ డైరక్టర్లు ఎండీ జానీపాషా, నారి యాదయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్‌ గుప్త, ఎస్సీసెల్‌ మండలాధ్యక్షులు నల్ల ప్రభాకర్‌, యువజన విభాగం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చింతక్రింది వీరేష్‌, విద్యార్థి విభాగం మండల అధ్యక్ష,కార్యదర్శులు బొట్టు ప్రవీణ్‌ నాయక్‌,ఆవుల ప్రశాంత్‌ యాదవ్‌, యాదగిరిగౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love