– పల్లె ప్రకృతి వనం, పంచాయతీ రికార్డుల తనిఖీ
నవతెలంగాణ-యాచారం
మండల కేంద్రంలో సోమవారం జాయింట్ కలెక్టర్ ఎల్బీ ప్రతిమసింగ్ ఆకస్మికంగా పర్యటించారు. మండల పరిధిలోని యాచారం, తక్కళ్లపల్లి తండా పల్లె ప్రకృతి వనాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో గడ్డమల్లయ్యగూడ పంచాయతీ రికార్డులను ఆమె తనిఖీ చేశారు. అనంతరం అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన నియమ, నిబంధన ప్రకారం అధికారులు నడుచుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.