– బీఅర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మండలాధ్యక్షులు డి.రాజు నాయక్
నవతెలంగాణ-ధారూర్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆ పార్టీ మండలాధ్యక్షులు రాజు నాయక్ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని దోర్నాల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌కు చెందిన మంగలి నరసింహులు, బీజేపీకి చెందిన వడ్డే శ్రీనివాస్, బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను అందరం కలిసికట్టుగా ఉండి తిప్పికొట్టాలని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. గతంలో ఎన్నికలు వచ్చినప్పుడే ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చేవరని, ఇప్పుడు అలా కాకుండా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలు వింటూ, పరిష్కరిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కే, వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, మండల రైతు బంధు అధ్యక్షులు సిహెచ్ వెంకటయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ జి. రాములు మార్కెట్ వైస్ చైర్మన్ అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి అంజయ్య, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజుగుప్త, మండల యువజన విభాగ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఎస్టీసెల్ అధ్యక్షులు దేవేందర్, మండల సమన్వయ కమిటీ సభ్యుడు రహమతుల్లా ఖాన్, బాలు నాయక్, గ్రామ సర్పంచ్ సుజాత వెంకట్రామిరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.