మాకు న్యాయం చేయండి

– అనుమతి లేకపోయినా ఆరు వేల అడ్మిషన్లు తీసుకున్న గురునానక్‌ యూనివర్సీటీ
– గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌
– విద్యా దినోత్సవం సరే..
– మా పరిస్థితి ఏంటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు
– గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీతో వారికి అన్యాయం జరిగిందని విద్యార్థుల ఆవేదన
– గురునానక్‌ కాలేజీ ఎదుట ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
తమకు న్యాయం చేయాలని, తమ విద్యా సం వత్సరం వృథా కాకుండా చూడాలని గురునానక్‌ విదా ్యర్థులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుక ల్లో భాగంగా విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించింది కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యా ర్థులకు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇబ్రహీంప ట్నం మండల సమీపంలోని కళాశాల ఎదుట విద్యార్థులు ధóర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గురునానక్‌, శ్రీనిధి యూనివర్సిటీలు రాష్ట్ర క్యాబి నెట్‌ తీర్మానంతో అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపారు. 2022-23 సంవత్సరానికిగాను ఆరు వేల మంది విద్యార్థులు చేరినట్టు తెలిపారు. కానీ యూనివర్సీటీల బిల్లు గవర్నర్‌ దగ్గర పెండింగ్‌ లో ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు పరీక్షలు నిర్వహించలేదని చెప్పారు. దీంతో తమ విద్యా సంవత్సరం వృథా అయ్యేలా ఉండని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజు లుగా యూనివర్సీటీల బిల్లు పెండింగ్‌లో ఉండ డం, ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా శ్రద్ధ పెట్టకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందన్నా రు. ఇదే విషయాన్ని కాలేజీ దృష్టికి తీసుకెళ్తే తమకు న్యాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయితే యూనివర్సీటీ బిల్లు పెండింగ్‌లో ఉండడం వలనే తాము ఏం చేయలేకపోతున్నాయని కాలేజీ యాజ మాన్యం చెబుతోందని తెలిపారు. నెల క్రితం తమ తల్లి దండ్రులతో కాలేజీ యాజమాన్యం సమావేశం నిర్వ హించిందని చెప్పారు. ఈ నెల 21లోపు సమస్యను పరి ష్కారిస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో కాలేజీ ఎదుట ధర్నా చేశామని తెలిపారు. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలో తమకు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొ రవ తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు. ఈ ధర్నాలో బాధిత విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love