ప్రతి ఒక్కరూ లక్ష్యం సాధించాలి

ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి నేనావత్‌ శంకర్‌ నాయక్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
ప్రతి ఒక్కరూ లక్ష్యం నిర్ధేశించుకుని దాన్ని సాధించాలని ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి నేనావత్‌ శంకర్‌ నాయక్‌ విద్యార్థులకు సూచించారు. బుధవారం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌, కొత్తగడి కళాశాలలో వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ సఖి క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ పి.అపర్ణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి ఎన్‌.శంకర్‌నాయక్‌ హాజరయ్యారు. ఈ క్యాంపుకి అమన్‌గల్‌, కోకట్‌, కమ్మదనం, బంట్వారం, చేవెళ్ల, మోమిన్‌పేట్‌, మహేశ్వరం, కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 8వ తరగతి విద్యార్థినులు హాజరయ్యారు. విద్యార్థినులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం గురించి పది రోజులపాటు క్యాంపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా అనుష్క బిస్వాస్‌, మరియు ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ గా ఆకాంక్ష జైన్‌, కౌన్సిలర్లుగా స్వర్ణారారు, అదితియాదవ్‌, శ్రీజ, శ్వేత వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ఆడపిల్లలు అన్నిరంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పేద విద్యార్థులకు ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నందుకు గురుకులాల సెక్రటరీ రొనాల్డ్‌ రోస్‌కి కళాశాల ప్రిన్సిపాల్‌ ధన్యవాదాలు తెలిపారు

Spread the love