తాళ్లపల్లి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నవతెలంగాణ-శంకరపల్లి
తాళ్లపల్లి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. 38 ఏళ్ల క్రితం తాళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో1984-85 సంవత్సరంలో పదవ తరగతిలో చదువుకుంటూ పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఒకరి కొరకు ఆప్యాయంగా పలకరించుకు ఆలింగనం చేసుకున్నారు. విద్యార్థులకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు శ్రీహరి మాట్లాడుతూ తాము పాఠాలు బోధించిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండటం గర్వకారణం అన్నారు. ఇన్ని సంవత్సరాలైనా నన్ను గుర్తు పెట్టుకొని నన్ను ఇక్కడికి పిలిపించి ఘనంగా సన్మానం చేయడం సంతోషకరంగా ఉందన్నారు. మీలో ఎవరికీ ఏ ఆపద వచ్చిన మీరందరూ కలిసికట్టుగా ఉండి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా మీపై ఉందని గుర్తు చేశారు. పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉండి మునుముందు సమాజ సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గురువులు చెప్పిన విధంగా నడుచుకుంటామని గురువుగారికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా సమాజసేవ తప్పనిసరిగా సేవ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love