నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండలంలోని చెల్లంపల్లి గ్రామంలో శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిన తన చిన్నమ్మ మృతదేహానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన గ్రామానికి చెందిన మంగలి వెంకటేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తనవంతు తక్షణ సహాయంగా వారికి రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుం టున్న బండారి నరసింV యాదవ్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. అతని ఆరో గ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డి, తులసీరామ్‌నాయక్, కృష్ణయ్య, హరిచంద్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, ప్రియా రమేష్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, నాయకులు పత్య నాయక్, గంప శ్రీనివాస్ గుప్తా, రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.