ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పెంటనోళ్ళ నరసింహ మాదిగ

– ఘనంగా ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
ఎస్సీ వర్గీకరణ కోసం దఢ సంకల్పంతో పోరాడుదామని, అతిపెద్ద సామాజిక ఉద్యమం ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమమని 29 సంవత్సరాలుగా ఉద్యమానికి చేయుతనిస్తూ ముందుండి నడిపిస్తున్న ప్రజలందరికీ ప్రత్యేక కతజ్ఞతలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పెంటనోళ్ళ నరసింహ మాదిగ అన్నారు. శుక్రవారం ఎంఆర్‌పీఎస్‌ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మందకష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్‌ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పెంటనోళ్ళ నరసింహ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29 ఏండ్లుగా అనేక సామాజిక మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమానికి ఉందని ఆయన అన్నారు. పాలకుల కుట్రలను చేదిస్తు, ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థపరులు కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమం 29 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని అన్నారు. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో సుదీర్ఘంగా నడుస్తున్న అతి పెద్ద ఏకైక సామాజిక ఉద్యమం ఎంఆర్‌పీఎస్‌ అని అన్నారు. ఇన్ని ఏండ్ల పోరాటంలో మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్థిత్వం, గుర్తింపుతో పాటు మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా 25 వేల ఉద్యోగాలను ఎంఆర్‌పీఎస్‌ అందించిందని అన్నారు. అలాగే మానవతా దక్పథంతో గుండె జబ్బుల చిన్నారుల కోసం, వికలాంగులు వద్దులు వితంతువుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, హత్యలకు, లైంగికదాడులకు గురైన మహిళల కోసం ఇలా ఎన్నో పోరాటాలు చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు.ప్రస్తుతం అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్‌ పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చినోళ్ళ అనంతయ్య మాదిగ, ఎంఆర్‌పీఎస్‌ బాలరాజు, శ్రవణ్‌ కుమార్‌ మాదిగ, బొబ్బిలి పాండు మాదిగ, దశరథ్‌ మాదిగ, మహేందర్‌ మాదిగ, సుమలత మాదిగ, సుజాత, సునీత, కవిత, శిరీష మాదిగ, రాజేంద్రప్రసాద్‌ ,రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love