సమస్యలు పరిష్కారించాలని రోడెక్కిన విద్యార్థులు చౌడాపూర్‌లో ఆశ్రమపాఠశాల విద్యార్థుల నిరసన

నవతెలంగాణ – చౌడాపూర్‌
చౌడాపూర్‌ మండలంలోని కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సోమవారం రోడ్డెక్కారు. హాస్టల్‌ భోజనంలో పురుగులు వస్తున్నాయని, హాస్టల్‌ వార్డ్‌న్‌ అసభ్య ప్రవర్తనతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కారించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ అశో క్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఘం అధ్యక్షులు నాసిర్‌, స్థానిక నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ… కనీసం విద్యార్థులు తినే ఆహారంలో కూడా నాణ్యత పాటించకపోవడం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డ్‌న్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సాయంత్రం కాగానే హాస్టల్‌లోనే పలువురితో కలిసి మద్యం తాగి విద్యా ర్థులను కొడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడు తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించు కోకుండా నిర్లక్షంగా వ్యవహారిస్తున్న వార్డ్‌న్‌పై కఠిన చర్యలు తీసుకావాలని డిమాండ్‌ చేశారు. విధు ల్లోంచి తొలిగించే వరకూ విద్యార్థులు పాఠశాలకు వెళ్ళమ న్నారు. కేవలం అధి కారుల నిర్లక్ష్యం కారణంగానే తరుచూ ఇలాంటి సంఘటన లు చోటు చేసుకుంటున్నా యన్నారు. సమస్యలపై కమిటీ వేసి విచారణ చేపట్టి సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌ విద్యార్థులతో మాట్లాడారు.. విద్యార్థుల సమస్యలు వెంట నే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంఘం అధ్యక్షులు నాసిర్‌, బీజేపీ మండలా ధ్యక్షులు, పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు, తదిత రులు పాల్గొన్నారు.

Spread the love