జాగా లేనిది ఇల్లు కట్టేదెట్టా..!

– గృహాలక్ష్మి పథకం ఎవరి కోసం సర్కారు జాగాలు ఇస్తేసరి..
లేదంటే మేమే గుడిసెలు వేస్తాం హక్కులు సాధించే వరకూ పోరు చేయాలి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మనాయక్‌ ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల జాగాలు ఇవ్వాల్సిందే ఈ ప్రాంత భూములపై ఇక్కడి ప్రజలకు హక్కులేదా..!
రైౖతు సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు కాడిగళ్ల భాస్కర్‌ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కదం తొక్కిన ప్రజలు..
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రభుత్వాలకు పేదల సమస్యలు కనిపంచడం లేదు. ఎన్నికల్లో డబ్బుల సంచులు అందించే బడా కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. జాగా లేనిది ఇల్లు కట్టేదెట్టా.. గృహాలక్ష్మి పథకం ఎవరి కోసం.. ఇండ్లు లేని ప్రతీ పేదోడికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి’ అని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్‌ అన్నారు. అర్హులైన వారికి ఇండ్లు, ఇండ్ల జాగాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలివ చ్చారు. కలెక్టరేట్‌ కార్యాలయం చూట్టుముట్టు ఎటూ చూసి నా జనాలు ఎర్రజెండాలు, తమ సమస్యలు పరిష్కారించా లని డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులు ప్రదర్శించారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని, పోడు భూములు పట్టాలు గిరిజనలకు మాత్రమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, బీస ీలకు కూడా ఫారెస్టు భూముల్లో పోడు కొట్టుకుని ఏండ్ల కొద్దిగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించారు. సానుకులంగా స్పందించిన అదనపు కలెక్టర్‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్‌ పగడాల యాదయ్య అధ్యక్షత నిర్వహించిన సభలో ధర్మనా యక్‌ మాట్లాడారు.. దేశంలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది మోజార్ట్టీ ప్రజలు బహుజన వర్గాలేనని.. కానీ ఆ ఫలితాలు అనుభవిస్తుంది మాత్రం దొరలు, రెడ్లు అన్నారు. పేదలకు దక్కాల్సి వాటా దక్కడం లేదన్నారు. పేదలు తమ హక్కులు సాధించే వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములను సీఎం తమ అనుచరులకు అప్పగిం చాడని మండిపడ్డారు. 58 జీవో ప్రకారం ప్రతి పేదోడికి 120 గజాల ఇంటి జాగాల ఇవ్వాలని ఉన్నప్పటికీ.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. 58, 59 జీవోను ఆసరగా చేసుకుని బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టిన పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల్లో భాగంగా గృహాలక్ష్మి పేరుతో పేదలను మభ్యపెడుతున్నారని మండిప డ్డారు. రూ. 3 లక్షలతో బాత్‌రూమ్‌లు కూడా కట్టుకోలేరని ఎద్దేవా చేశారు.
రైతు సంఘం నాయకులు కె. భాస్కర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతంలో సామాన్యుడు గుంట జాగా కొనుగోలు చేసే పరిస్థితి లేదని.. వీరికి ప్రభు త్వం ఇంటి జాగాలు ఇవ్వాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి పేరుతో బడా పెట్టుబడిదారులకు ధారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో వ్యాపారులు భూములు తీసుకుని రి యల్‌ ఎస్టేట్‌ చేస్తున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ పేదల భూ ములు కనిపిస్తే అక్కడ ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వెంచర్లు చేసి రూ. కోట్లు దండుకుంటుందన్నారు. బడాబా బులపై చర్యలు తీసుకోకుండా పేదలపై జులుం ప్రదర్శించ డం సరికాదాన్నరు. జిల్లా కలెక్టర్‌ ప్రజలకు ఏ రోజు అందు బాటులో ఉండడు.. ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నారని ప్రశ్నించారు. భూస్వాములు, వ్యాపార వేత్తలు ఇచ్చే కమీష న్లు తీసుకుని.. వారి భూ సమస్యలు పరిష్కరించేందుకు పరిమితమయ్యారన్నారు. జిల్లాలో పేదలకు ఇండ్ల జాగాలు ఇచ్చే వరకూ ఎర్రజెండా వారి పక్షాన పోరాడుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిందా పరి లేదంటే ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతి, పేదలతో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు.
కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సామేల్‌ మాట్లాడుతూ దళితుల భూముల్లో సర్కార్‌ వెంచర్లు చేసి రూ. వేల కోట్లు దండుకుంటుందన్నారు. కానీ పేదోడికి గుంట జాగా ఇచ్చేం దుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్ల జాగాల సర్టిఫికెట్లకు ఇప్పటికీ పోజిషన్‌ ఇవ్వలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం గతంలో పం పిణీ చేసిన ఇండ్ల జాగాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చే శారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పేదలకు పంపిణీ చేసిన భూములను ధరణి పేరుతో భూస్వాములకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలింగ్‌, మిగులు భూములు, అసైన్డ్‌ భూములకు పట్టా పాసు పుస్తకాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా సంఘాల నాయకులు కె.జగ న్‌, పి,అంజయ్య, సిహెచ్‌ జంగయ్య, ఎన్‌, శ్యామ్‌సుందర్‌, శ్రీనునాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎం.ప్రకాష్‌కరత్‌, అలంపల్లి నర్సింహ్మా, జగదీశ్‌, ఈ.నర్సింహ్మా, డి.కిషన్‌, సుమలత, ఎం.అరుణ, డి.మమత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love