ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు

ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్‌ హారిక అన్నారు. డాక్టర్స్‌ డే సందర్భంగా నవతెలంగాణతో ఆమె మాట్లాడారు. డాక్టర్లకు, ప్రజలకు డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.
నవతెలంగాణ-పరిగి
కార్పొరేట్‌ హాస్పిటలకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంలో ఎక్కువ సీజన్‌ వ్యాధులు ప్రభలు తాయని అందు కోసం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సీజన్‌ లో ఎక్కువగా వైరల్‌ ఫీవర్‌ వంటివి వస్తాయి కాబట్టి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. షుగర్‌, బీపీ, ఆస్తమా, టీబీ వంటి వ్యాధులకు చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రక్తహీనత కలవారికి రక్తం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపి భారీగా పెరిగిందని సూచిం చారు. పిల్లలు కానీ వారికి కూడా చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ, బుధవారాల్లో గర్భిణీలకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. గర్భిణీలకు న్యూట్రిషన్‌ కిట్స్‌ కూడా అందిస్తు న్నామని తెలిపారు. ఆస్పత్రిలో డెలివరీ చేయించుకున్న మహిళలకు కేసిఆర్‌ కిట్టు అందిస్తున్నామని అన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ జన్మిస్తే రూ.12వేలు అందిస్తున్నామని అన్నారు. 104 వాహనం ద్వారా గర్భిణులను ఆస్పత్రికి తీసుకువచ్చి డెలివరీ అయిన తర్వాత అదే వాహనంలో ఇంటి వరకు దింపుతున్నామని అన్నారు. ప్రత్యేకంగా డయాలసిస్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.

Spread the love