సమానత్వం, సమాజహితమే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యం

– ఎమ్మార్పీఎస్‌ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్‌ కాడిగల ప్రవీణ్‌కుమార్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
సమానత్వం, సమాజహితమే ఎమ్మార్పీఎస్‌ ఉద్యమ లక్ష్యమని ఎమ్మా ర్పీఎస్‌ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్‌ కాడిగల ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఎమ్మార్పీఎస్‌ 29వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం శంకరపల్లి చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకు దృఢ సంకల్పంతో 29 ఏండ్లుగా అనేక సామాజిక, మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి ఉంద న్నారు. ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థ పరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం 29 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని తెలిపారు. మాదిగల కోసమే పోరాటం ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేస్తుందన్నారు. ఉద్య మానికి అండదండలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మా ర్పీఎస్‌ శంకర్‌పల్లి మండల ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, సీనియర్‌ నాయ కులు లక్ష్మయ్య, నర్సింలు, శంకర్‌, ఎమ్మెస్‌ఎఫ్‌ నాయకులు వంశీ, మనోజ్‌, శ్రీకాంత్‌, శీను, ప్రవీణ్‌, హన్మంత్‌, శివ, సతీష్‌, రాజు, అశోక్‌, నాయకులు తదితరులున్నారు.

Spread the love