మహిళల కోసం ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం

చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే
మహేష్‌ రెడ్డి, కలెక్టర్‌ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య మహిళ ఓపీ విభా గాన్ని ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎంపీ రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించింది. నిజాం తర్వాత ఏ ప్రభుత్వాలూ ఒక్క ఆస్పత్రిని కూడా కట్టలేదని, కేసీఆర్‌ ప్ర భుత్వం ఎన్నో ఆస్పత్రులు కట్టిచారన్నారు. నీతి ఆయోగ్‌ సర్వేలో రాష్ట్ర వైద్య రంగానికి దేశంలో 3 స్థానం కల్పించా రన్నారు. మహిళల కోసం ప్రతి మంగళవారం ఆరోగ్య మ హిళ అనే కార్యక్రమం చేపట్టి ఎనిమిది రకాల వ్యాధులకు చికిత్సలతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించా రన్నారు. కేసీిఆర్‌ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ను మంజూరు చేశారన్నారు. కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో కోటి రూ.50 లక్షల మందికి నిర్వహించి రూ.40 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశారన్నారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని పరిరక్షించే వాడే వైద్యుడన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖను గ్రామస్థాయి నుండి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వరకు ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యానికి కృషి చేసిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్ప త్రుల్లో 80 శాతం వరకు ప్రసావాలు జరుగుతున్నాయని, అందులో ఎక్కువ శాతం సాధారణ ప్రసవాలేనని అన్నారు. వైద్య శాఖ ద్వారా గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడానికి, పోషకార స్థాయిని పెంచి మాతృమరణాలను నిరోధించ డానికి రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్‌ కిట్లను అందింస్తుంద న్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం వికారాబాద్‌లో మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎపీపీ మల్లేశం, పిఏసీఎస్‌ చైర్మెన్‌ ప్రభాకర్‌ రెడ్డి, దోమ సర్పంచ్‌ కె.రాజిరెడ్డి, తహసీల్దార్‌ శాహిదా బేగం, వైద్యాధికారి శ్రీవిద్య, రైతు స మన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మయ్య, మండలాధ్యక్షులు గో పాల్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సురేందర్‌, ఎంపీటీసీ లు అనిత, రాములు, వైద్య సిబ్బంది ఆశావర్కర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love