అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు పనిచేయాలి

– కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు మస్కు నర్సింహా
– యాచారం కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని స్థానిక యాచారం, అనుబంధ గ్రామాలు మొగుళ్ళవంపు, గాండ్లగూడల కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీని ఆదివారం కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు మస్కు నర్సింహా సమక్షంలో ఆ నాయకులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రెడ్డి వెంకటరెడ్డి, జనరల్‌ సెక్రెటరీ మస్కు అనిల్‌, ఉపాధ్యక్షులుగా మాషమోని భాష, గడ్డం కష్ణ, సలహాదారులుగా గడల అంజయ్య, బేగరి లక్ష్మయ్య, యాచారం మండలం ఉపాధ్యక్షులుగా బోయిని వెంకటయ్యలను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిని అభినందించి సన్మానించారు. అనంతరం పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుందని రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ పట్ల ప్రజలు విశ్వాసంగా ఉన్నారని గత కాంగ్రెస్‌ పార్టీ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపే కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు మస్కు నర్సింహాఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ మరింత అభ్యున్నతి చెందేలా ఎన్నికైన వారంతా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్‌ నాయిని సుదర్శన్‌ రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ గజ్జి రామకష్ణ యాదవ్‌, జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఉప్పల భాస్కర్‌, నాయకులు సుధీర్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల జనరల్‌ సెక్రెటరీ జయప్రకాష్‌, అంజయ్య, వెంకటయ్య, అబ్బయ్య, పాషం పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love