చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది వెంకటేష్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో అర్హులైన ప్రతి పేదవారికీ, ఆర్థిక స్తొమత లేనివారికి, ఆర్థిక న్యాయ సహాయం అందిచడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కృషి చేస్తుందని శనివారం న్యాయ అవగా హనా సదస్సులో తెలిపారు. ఈ సందర్భంగా టి వెంకటేష్ మాట్లాడుతూ వ్యయా ప్రయాసలు లేని సత్వర న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ వ్యవస్థను వినియోగించు కోవాలని, కోర్ట్ లందు చాలా రోజులనుండి నిలిచిపోయిన కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే, అం దరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఆర్థిక కారణాల ములంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ అందించాలని ప్రభుత్వం భావించి భారత రాజ్యంగానికి అధికారణ 39-ఏ జతచేసి బీద, బలహీన వర్గాల వారికీ ఉచిత న్యాయ సహాయం అం దించటం రాష్ట్ర ప్రభుత్వల బాధ్యతగా నిర్దేశించినారు. ఇం దుకోసం న్యాయ సేవల అధికార చట్టం చేసారని తెలిపా రు. బండి, కారు, ఆటో కలగిన ప్రతి ఒక్కరూ వాటికి తప్ప నిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికీ కానీ ప్రమాదంలో గాయపడిన లేదా మృతి చెందిన వారికి ఇన్సూరెన్స్ వారు నష్టపరిహారం చెల్లి స్తారని తెలిపారు. న్యాయవాది ఏ.రాజశేఖర్ మహిళా చట్టాలను, భరణం పొండటానికి ఎవరు అర్హులో విపు లంగా తెలిపారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్ల లదేనని సీనియర్ సిటిజన్స్ చట్టం చెబుతుందని ఎవరైనా తల్లిదండ్రులను చూడకపోతే వారు కలెక్టర్, ఆర్‌డీఓకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటారని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు వారు కొనే విత్త నాలు, పురుగుల మందులుకు బిల్లు తప్పనిసరిగా తీసుకో వాలని, ఏవైనా నకిలీ విత్తనాలు పురుగు మందులైతే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకొని న్యాయం చేయటానికి న్యాయ సేవా అధికార సంస్థ కృషి చేస్తుందని పోక్స్ చట్టం గురించి, లేబర్ చట్టాలను తెలుపుతూ ప్రతి ఒక్కరూ లేబర్లకు గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన ఇన్సూరెన్స్ తీసుకోవా లన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివ రించి వారి సందేహాలు నివృత్తి చేశారు. అవగాహనా సద స్సులో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, జన్ సహాస్ ఎన్జీవో ప్రకాష్ పాల్గొన్నారు.