టెండర్లు రాని రిజర్వేషన్‌ దారులకు రుసుం తిరిగి చెల్లించాలి

The reservation fee should be refunded to the non-tenders– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ-ఆమనగల్‌
టెండర్లు రాని రిజర్వేషన్‌ దారులకు టెండర్‌ కోసం వారు కట్టిన రుసుము తిరిగి చెల్లించాలని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆమనగల్‌ పట్టణంలో జరిగిన గౌడ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో భాగంగా ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి మూడు నెలల ముందే టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం రిజర్వేషన్ల ముసుగులో ముసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు. వైన్స్‌ షాపుల నిర్వాహణలో రిజర్వేషన్‌ అమలుపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టెండర్ల ఫలితాల్లో వైన్‌ షాపులు దక్కని ఎస్సీ, ఎస్టీలతో పాటు గౌడ్స్‌ల టెండర్‌ రుసుము రూ.2 లక్షలు తిరిగి చెల్లించి రిజర్వేషన్‌ టెండర్‌ దారులకు న్యాయం చేయాలని శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. అదేవిధంగా పక్క రాష్ట్రాల బడా వ్యాపారులు సిండి కట్‌గా ఏర్పడి వైన్స్‌ షాపులు దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అరికట్టి వైన్స్‌ షాపుల టెండర్లలో పూర్తిగా స్థానికులకే అవకాశం కల్పించి ప్రభుత్వం తమ తెలంగాణ వాదాన్ని నిరూపించుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో గౌడ సంఘం సీనియర్‌ నాయకులు చుక్క అల్లాజీ గౌడ్‌, యాచారం వెంకటేశ్వర్లు గౌడ్‌, దుర్గయ్య గౌడ్‌, గంగ రవీందర్‌ గౌడ్‌, చుక్క నిరంజన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love