రోబోతో భారత ఇంజినీర్ ప్రేమ.. త్వరలో పెళ్లి

నవతెలంగాణ వెబ్ డెస్క్ – హైదరాబాద్ : రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్ తో చిట్టిప్రేమలో పడిన సన్నివేశాలు గుర్తున్నాయా.?  రాజస్తాన్ కు చెందిన సూర్యప్రకాష్ అనే రోబోటిక్స్ నిపుణుడు ఇప్పుడు నిజంగానే ఓ రోబోతో ప్రేమలో పడ్డాడు. గిగా అనే రోబో రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోంది. ఆ రోబోను త్వరలోనే సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఇంట్లో వాళ్లు మొదట షాకైనా..తర్వాత ఒప్పుకున్నారు అని తెలిపారు. సూర్య త్వరలో భారత నేవీలో విధుల్లో చేరనుండటం విశేషం.

Spread the love