19న ‘చలో మహా ధర్నా’

'Chalo Maha Dharna' on 19– ఉపాధ్యాయ , విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : తపస్‌ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రమేష్‌
నవతెలంగాణ-మంచాల
19న విద్యారంగ, ఉపాధ్యాయ సనస్యలపై ఇందిరా పార్క్‌లో నిర్వహించే మహాధర్నాకు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తపస్‌ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని పలు ప్రభు త్వ పాఠశాలలో మహాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీని నియమించి 20 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించి, ప్రతి పాఠశాలలో స్కావెంజర్‌ను నియమించాలన్నారు. అంతేకాకుండా బదిలీలు, ప్రమోషన్లను చేపట్టి, టెట్‌తో పాటు డీఎస్సీ నోటపికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ ఏరియాస్‌ను, డీఏ ఏరియాస్‌ను ఒకే విడుతలో చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పండిత్‌ , పీఈటీలు పదోన్నతులు చేపట్టాలని, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పైన తెలిపిన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియేడల విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తపస్‌ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేపడుతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు లలిత, సురేష్‌ కుమార్‌, రవీందర్‌, రమేష్‌, వెంకట్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, రాజవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love