నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో మైసమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. సాయంత్రం పరిగి పట్టణ కేంద్రంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో పరిగి పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు.