ప్రగతి పథంలో పెద్ద షాపూర్‌ పీహెచ్‌సీ

సాధారణ ప్రసవాలతో ప్రత్యేక గుర్తింపు
పెరిగిన ఔట్‌ పేషెంట్లు
ఎన్‌క్యూఏఎస్‌ఎస్‌ సంస్థ ప్రతినిధుల ప్రశంస
పెద్ద షాపుర్‌ పీ హెచ్‌ సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ చుక్కా
సేవలు 24 గంటలు అందుబాటులోకి రావాలని ప్రజల ఆకాంక్ష
సాధారణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రగతి పథంలో పయనిస్తున్నది. శంషాబాద్‌ మండల పరిధిలోని పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. కేవలం 12 గంటలు మాత్రమే పని చేయాల్సిన ఈ పీహెచ్‌సీ అవసరాన్ని బట్టి పనిగంటలతో నిమిత్తం లేకుండా డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రభాకర్‌ చుక్కా స్వయంగా గైనకాలజిస్ట్‌ కావడంతో కాన్పులకు శ్రీకారం చుట్టారు. మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ సంస్థ పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. జులై 1న డాక్టర్స్‌ డే సందర్భంగా పెద్ద షాపూర్‌ ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ చుక్కా నవతెలంగాణతో శుక్రవారం మాట్లాడారు.
నవతెలంగాణ-శంషాబాద్‌
పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి తెలపండి?
పెద్ద షాపూర్‌ ఆరోగ్య కేంద్రంలో నేను మే రెండవ తేదీ 2022 సంవత్సరంలో ఇక్కడకు డిప్యూటేషన్‌పై వచ్చాను. 2022 డిసెంబర్‌ 31 వరకు వంద మంది గర్భిణీలకు సాధారణ కాన్పులు చేశాను. జనవరి ఒకటి 2023 నుంచి జూలై వరకు 150 సాధారణ కాన్పులు జరిగాయి. అంతకుముం దు ఇక్కడ కాన్పులు జరగలేదు.
ప్రతిరోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 110-120 మళ్లీ బయట రోగులు వస్తారు. ఇందులో 10 నుంచి 15 మంది క్రమం తప్పకుండా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ల్యాబ్‌ లాబ్‌ టెక్నీషియన్‌, ఇన్వెస్టిగే షన్‌, ఫార్మాటిస్టు స్టాఫ్‌ నర్స్‌లు నలుగురు, సిబ్బంది ఇద్దరు సూపర్వైజర్లు ఇద్దరితో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచే ఆయుష్‌ కొనసాగుతున్నది. ప్రతీరోజు 12 గంటలు మాత్రమే పీ హెచ్‌ సీ పనిచేయాల్సి ఉంటుంది.
పెద్ద షాపూర్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతినెలా ఎన్ని ప్రసవాలు జరుగుతాయి?
పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతినెలా 70 వరకు సాధారణ ఆపరేషన్‌తో కాన్పులు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 నుంచి 30 మధ్యలో ఆపరేషన్‌ లేకుండా సాధారణ కాన్పులు చేస్తున్నాం. శంషాబాద్‌ క్లస్టర్‌ ఆరోగ్య కేంద్రంలో 40 నుంచి 60 కాన్పులు చేస్తారు. 70 శాతం సాధారణ కాన్పులు 30 శాతం ఆపరేషన్లు చేయాలి.
ఏ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి?
షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి మంగళవారం గర్భిణులకు పరీక్షలు, బుధవారం వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతుంది. దీంతో పాటు సాధారణ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులు ఇవ్వడం లేదా పరిస్థితి విషమించి ఉంటే కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు.
పీహెచ్‌సీ అభివృద్ధికి చర్యలు ఏమన్నా ఉన్నాయా?
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సెంట్రల్‌ అస్సార్స్‌ నేషనల్‌ క్వాలిటీ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రతినిధులు జూన్‌ 12వ తేదీన పెద్ద షాపూర్‌ ఆరోగ్య కేంద్రాన్ని సం దర్శించారు. అక్కడ పేషంట్లకు అందుతున్న వైద్యం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు గురించి సంతృప్తిని వ్యక్త పరిచారు. ఇటీవల ఫైర్‌ సేఫ్టీ అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.
పెద్ద షాపుర్‌ పీహెచ్‌సీ 12 గంటలు మాత్రమే పనిచేయాలని నిబంధన ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆ మోదం లభిస్తే 24 గంటలు వైద్య సేవలు అందుబా టులోకి వస్తాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన పరిశీలన పూర్తి అయ్యింది. నాతో పాటు సిబ్బంది కలిసి అదనపు విధులు నిర్వహిస్తున్నాం. సాధారణ కాన్పుల వలన ప్రజల్లో భరోసా ఏర్పడింది. వైద్య సేవలు అందుబాటులోకి రావడంలో పెద్ద షాపూర్‌ సర్పంచ్‌ చెక్కల చంద్రశేఖర్‌ ముదిరాజ్‌, ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌, ఇతర ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love