– 20వ తేదీలోపు రిపోర్టు ఇవ్వాలి : ఎంపీడీవో
నవతెలంగాణ-శంకర్‌పల్లి
రాష్ట్ర ప్రభుత్వం బడుగు,బలహీన వర్గాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై గ్రామ కార్యదర్శులు గ్రామాల్లో సర్వే చేసి, అర్హుల వివరాలు 20వ తేదీలోపు రిపోర్ట్ ఇవ్వాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. సోమవారం శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకర్పల్లి మండలంలోని 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. గృహలక్ష్మి పథకం కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. గ్రామ కార్యదర్శులు చేసే సర్వేపైనే లబ్దిదారుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తగా సర్వే చేసి, లబ్దిదారులు నష్టపోకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా మేరీ దేశ్ మేరీ మట్టి వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 750 మొక్కలు నాటాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, సూపరింటెండెంట్ రవీందర్, గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.