నవతెలంగాణ-మొయినాబాద్
మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌండ్ల నిరంజన్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ నియోజక వర్గ సభ్యులు షాబాద్ దర్శన్ హాజరై, మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న అనేక ప్రజా సమస్యలు వింటుంటే చాలా బాధగా ఉందనీ, ఏ గడపకు వెళ్ళినా బీఆర్‌ఎస్ ప్రభుత్వపై వ్యతిరేక విధానాలే వినపడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. అనేక మంది నిరుపేదలకు నిల్వ నీడ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, కనీసం వారికి డబ్బుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడంలో విఫల మైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు కేటాయిస్తామన్నారు. రైతులకు రైతు డెకరేషన్‌లో పొందుపరిచిన హామీలనీ అమలు చేస్తామని చెప్పారు. యువతకు యూత్ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి ఒక్క హామీనీ నెరవేరుస్తామని భరోసాకల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య, మండల సహకార సంఘం చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ బి. సత్యనారాయణ, ఉప సర్పంచ్ భిక్షపతి, టీపీసీసీ మైనార్టీ కో-కన్వీనర్ కాజా పాషా, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేబుల్ రాజు, జిల్లా నాయకులు జంగారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు మర్రి రవీందర్ రెడ్డి, సత్తనారాయణ బాబున్న, జంగయ్య, తల్లారి భిక్షపతి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.