అంగన్వాడిల సేవలు భేష్‌

– మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీ
– ఘనంగా నర్సాపూర్‌ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ 44వ వార్షికోత్సవం
నవ తెలంగాణ-నర్సాపూర్‌
గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడి టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలు బేష్‌ అని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీ అన్నారు. శనివారం నర్సాపూర్‌లోని సాయి కష్ణ ఫంక్షన్‌ హాల్‌లో నర్సాపూర్‌ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు నలభై నాల్గవ వార్షికోత్సవాన్ని, ప్రీస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ డేను సిడిపిఓ హేమ భార్గవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంతి వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు , గర్భిణీకు, బాలింతలకు అందుతున్న సేవలపై స్టాల్‌ ఏర్పాటు చేశారు. మాడల్‌ అంగన్వాడి కేంద్రాలు, కిచెన్‌ గార్డెన్‌, పోషకాహారం, ప్రీస్కూల్‌ మెటీరియల్‌ తదితర అంశాలపై స్టాల్‌ ఏర్పాటు చేయగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీతో పాటు ఆర్జెడి ఝాన్సీ, డి డబ్ల్యుఓ బ్రహ్మాజీలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్‌ కాంతి వెస్లీ మాట్లాడుతూ నర్సాపూర్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు, గర్భిణీ బాలింతలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. మాతా శిశు సంరక్షణ అందరి బాధ్యతని విద్య, ఆరోగ్యవంతమైన సమాజం అవసరమని అందుకోసం అంగన్వాడిలు చేస్తున్న కషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం అంగన్వాడిలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. అనంతరం సీడీపీఒ హేమా భార్గవి మాట్లాడుతూ 1980లో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో నర్సాపూర్‌, రామాయంపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఏర్పడ్డాయని తెలిపారు. నర్సాపూర్‌ ప్రాజెక్టులో 100మంది అంగన్వాడి కార్యకర్తలతో కార్యక్రమలు ప్రారంభమైందని అప్పటినుండి అంగన్వాడి సేవలో విశేష మైన మార్పులు వచ్చాయన్నారు. ఆనాడు పాలపొడి, మురుకులు, ఉప్మా అందించేవారని చెప్పారు. రాష్ట్రంలో పిల్లలు, గర్భిణీలు ఒక్కపూట పూర్తిస్థాయి భోజనం ఆరోగ్య లక్ష్మి పథకం నర్సాపూర్‌లోని ప్రారంభమైందని ఆమె గుర్తు చేశారు. పిల్లలకు, గర్భిణీలకు మహిళలకు ఆకుకూరలు పోషకాలతో కూడిన భోజనం, పాలు, కోడిగుడ్డుతో పూర్తిస్థాయిలో నేడు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. మోడల్‌ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్వ ప్రాథమిక విద్య, ప్రీస్కూల్‌ స్టడీ మెటీరియల్‌తో ఆటపాటల ద్వారా విద్యాబోధన, సజనాత్మకత వెలికితీత కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యాభివద్ధికి కషి చేస్తున్నామన్నారు. దీంతోపాటు అంగన్వాడి కేంద్రాల్లో కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేసి ఆకుకూరలు కూరగాయల మొక్కలు పెంచుతున్నామని వాటిని మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నామని చెప్పారు. కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటుకు శిక్షణ ఇచ్చి సహకరించిందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల పెరుగుదల, ఎత్తు బరువు కొలతలు ప్రతినెల ఆన్లైన్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు. ఆన్లైన్లో పిల్లల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు పౌష్టికాహారం పంపిణీ, టి హెచ్‌ ఆర్‌ వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌ ఐసీడిఎస్‌ ప్రాజెక్టు ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న 9మంది సీనియర్‌ అంగన్వాడి టీచర్లు, 1 ఆయాను ఘనంగా సన్మానించారు. దీంతోపాటు పలువురు ఉత్తమ అంగన్వాడి టీచర్లను సన్మానించారు. అంతకుముందు గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల పలు సాంస్కతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆకట్టుకున్న యి. 44వ వార్షికోత్సవ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలోని వివిధ అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమా భార్గవి, ఏఆర్‌ఈ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ సునీత, టీఎన్జీవో అధ్యక్షులు కార్యదర్శులు నరేందర్‌, రాజ్‌ కుమార్‌, అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love