నీలం మధు భారీ రోడ్‌ షో

నవతెలంగాణ-నార్సింగి
మెదక్‌ లోక్‌ సభ ఎన్నికల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నీలం మధు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జితో పాటు మండల కేంద్రంలో శనివారం రోడ్‌ షో నిర్వహించారు. నీలం మధు రోడ్‌ షో మండల కాంగ్రెస్‌ నాయకులలో కొత్త జోష్‌ను, ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు కూడా భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్సింగి ఎంపీటీసీ సత్యనారాయణ, మండల బీఆర్‌ ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్‌, మాజీ ఎంపీటీసీ దొంతి సులోచన దేవదాస్‌లను మధు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోడ్‌ షోలో నీలం మధు మాట్లాడుతూ శాసన సభలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు హామీలలో ఇప్పటికే ఐదింటిని అమలు చేసిందని, మిగతా హామీలు కూడా ఎన్నికల కోడ్‌ ముగియగానే పూర్తి చేస్తుందని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ఆగస్ట్‌ పదిహేను లోపు ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ప్రజలు కలత చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు చేసిన అభివధి మాటలలో తప్ప కార్యాచరణలో లేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నార్సింగి ప్రజల అభీష్టం మేరకు జాతీయ రహదారి దాటడానికి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తప్పనిసరిగా నిర్మిస్తామని, శాసన సభ ఎన్నికలలో గెలుపు పొందిన అనంతరం స్వల్ప కాలం లోనే మండలానికి ఒక కోటి ఇరవై అయిదు లక్షల సీసీ రోడ్ల నిర్మాణం చేశామని పేర్కొన్నారు. గోదాం పనులను పూర్తి చేసి, శాలిపెట్‌ రోడ్డు నిర్మాణం, వెంకటేశ్వర కళ్యాణ మండపం నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. తాను కూడా బలహీన బడుగు వర్గానికి చెందిన వాడేనని, వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌, సర్పంచిగా పని చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, ఇప్పుడు మీ ముందు ఎంపీగా పోటీ చేయడానికి నిలబడ్డానన్నారు. బలహీన వర్గాల నుంచి వచ్చిన తనకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉందని, ప్రజా సేవ కోసమే పోటీ చేస్తున్నానని, తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్ర, రాష్ట్ర నిధులతో మెదక్‌ ను అభివద్ధి పరుస్తానని, ప్రజల కష్టాలు తీరుస్తానని హామీ నిచ్చారు. తనపై నమ్మకం ఉంచి తనకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌ గౌడ్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి, మెదక్‌ జిల్లా ఎన్నికల సహా ఇంఛార్జి, టీ పీ సీ సేవా దల్‌ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నం రాజేందర్‌ రెడ్డి, శంకరం పెట్‌ మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్‌, జిల్లా నాయకుడు బాల్‌ రాజు గౌడ్‌, తాళ్ల కష్ణ గౌడ్‌, మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు రాజు గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు స్వామి బాచి, ఫిషర్‌ మెన్‌ అధ్యక్షుడు సుధాకర్‌, చందు యాదవ్‌, సంపత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love