ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి :ఎంపీపీ

Women should grow economically with the encouragement of the government, MPP– 16వ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-యాచారం
ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో మహిళలంతా ఆర్థికంగా ఎదగాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాషా అన్నారు. సోమవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న ఐకేపీ భవనంలో నిర్వహించిన మహిళా సమైక్య 16వ సర్వసభ్య సమా వేశంలో ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో పొదుపు సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలను అన్ని విధాలా సద్విని యోగించుకోవాలన్నారు. దేశంలో మహిళలు ఆర్థికంగా ఎదిగిన ప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. పొదుపు సంఘాల మహిళలు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి ఏపీఎం సుదర్శన్‌రెడ్డి, పద్మ, విజయలక్ష్మి, సుజాత, సీసీలు రాజు, గణేష్‌, శ్రీహరి, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love