హరితహారంలో అందరూ భాగస్వాములవ్వండి

Let's all take part in greening– ఫరూఖ్‌ నగర్‌ ఎంపీపీ ఖాజా ఇంద్రిస్‌, జడ్పీటీసీ వెంకట్‌ రాంరెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్‌
హరితహారంలో అందరూ భాగస్వాములై, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ ఖాజా ఇంద్రిస్‌, జడ్పీటీసీ వెంకట్‌ రాంరెడ్డి అన్నారు. సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మధురాపూర్‌, గంట్లవెల్లి, దేవుని బాండతండా గ్రామ పంచాయతీలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అందరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. చెట్లు పెంచడం వలన మానవాళికి మంచి ఆరోగ్యం లభిస్తుందని, కలుషితమైన వాతావరణం నుంచి మనలన్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు. అనంతరం మధురాపూర్‌ గ్రామంలో రూ.ఐదు లక్షలతో జడ్పీ నిధుల నుంచి సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వినరు కుమార్‌, సర్పంచులు శివారెడ్డి, యాదమ్మ యాదయ్య, మధులత మోహన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love