పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలంలోని రావిచేడ్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థుల సౌకర్యార్థం ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మరుగు దొడ్ల నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించింది. ఈసందర్భంగా పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న మరుగుదొడ్ల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ ఇటీవల పాఠశాలలో జరిగిన క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొండ పల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి మరుగుదొడ్ల నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.దీంతో ఉప్పల వెంకటేష్‌కు స్థానిక సర్పంచ్‌తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శేఖర్‌, తిరుపతి నాయక్‌, యాదగిరి, రామచంద్రయ్య, వాసుదేవ్‌, అబ్బు, రమేష్‌, మల్లయ్య, కష్ణయ్య,వినోద్‌, రవి, సందీప్‌, శ్రీకాంత్‌, పాండు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఉప్పల వెంకటేష్‌ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.
4

 

Spread the love