నిబద్దతతో ఎన్నికల విధులు నిర్వహించాలి

– ఎలక్షన్‌ జనరల్‌ అబ్జర్వర్‌ సమీర్‌ మాధవ్‌ కుర్త్కోటి
– ఏఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సంగారెడ్డి
మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గంలో సంగారెడ్డి, పటాన్‌చెరు సెగ్‌మెంట్‌లలో ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు చేప ట్టామని ఏఆర్‌ఓ/రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాధురి తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని మెదక్‌ జిల్లాకు నియమి తులైన ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్‌ మాధవ్‌ కుర్త్కోటి శనివారం సంగారెడ్డి రెవిన్యూ డివిజినల్‌ అధికారి కార్యాల యంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పఠాన్‌ చెర్వు సెగ్‌ మెంట్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు, నోడల్‌ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ రూపేష్‌ , సంగారెడ్డి రెవిన్యూ డివిజినల్‌ అధికారి వసంతకుమారి ఈ సమీక్షలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలో ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహ ణకు చేపట్టిన చర్యల గురించి సహాయ రిటర్నింగ్‌ అధికారి, మాధురి.. అబ్జర్వర్‌కి వివరించారు. పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలోసంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పఠాన్‌చెరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, సంగారెడ్డి నియోజకవర్గంలో 249775, పఠాన్‌ చెర్వు నియోజ కవర్గంలో 413 983, మొత్తం 663758 మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. రెండు నియోజక వర్గాలలో 692 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను నియమించి పక డ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎన్నికల వ్యయాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన టీంలు క్షేత్రస్థాయి నుంచి అన్ని విధాలుగా పరిశీలన చేయాలని ఎలక్షన్‌ జనరల్‌ అబ ్జర్వర్‌ సమీర్‌ మాధవ్‌ కుర్త్కోటి ఆదేశించారు. ఎన్నికల్లో ఓట ర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు, ఎక్సయిజ్‌ శాఖల సమన్వ‌యంతో లిక్కర్‌ను కంట్రోల్‌ చేయాలని నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. ఎఫ్‌ ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిం చాలన్నారు.ఎస్పీ రూపేష్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంద ని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోలేదని పరిశీలకుల దష్టికి తెచ్చారు. ఓటర్ల‌ను ప్రలోభపర్చే చర్యలను నిరోధించేందుకు వీలుగా జిల్లా సరిహద్దుల్లో అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులు, నెలకొల్పి నిరం తరం తనిఖీలు జరిపిస్తున్నామని, ఇవే కాకుండా జిల్లా అంత టా డైనమిక్‌ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని వివరిం చారు. సరిహద్దు ప్రాంతం నుండి అక్రమ మద్యం, నగదు, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ బందో బస్తు నియమిస్తున్నామని, సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక దష్టిని కేంద్రీకరిస్తున్నామన్నారు. సమీ క్ష అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయాన్ని సందర్శించారు సాధారణ ఎన్నికల పరిశీలకునికి క్రాంతి వల్లూరు, సాదరం గా స్వాగతం పలికి పుష్పగుచ్ఛము అందచేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఏంసిఏంసి కేంద్రాన్ని ఆయన పరిశీలిం చారు. మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ కంట్రోల్‌ రూమ్‌లను పరిశీలించారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా పత్రికల్లో, టీవీ ఛానల్లో రాజకీయ పార్టీలు ప్రకటనలు వేయో ద్దన్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, బల్క్‌ మెసేజెస్‌లను పరిశీలించాలని, దిన పత్రికలలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే అడ్వర్టై జ్మెంట్లను గుర్తించి ఎక్స్పెండిచర్‌ నమోదు చేయాలన్నారు. అంతకు ముందు సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ ఖాన్‌ పేట్‌ గ్రామంలో 4 పోలింగ్‌ కేంద్రాలను దాశివపేట మున్సిపాల్టీ కేంద్రంలోని సదాశివ్‌పేట్‌ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్య‌లు కల్పించాలని ఆదేశించారు. కంది మండలం ఇంద్రక రణ్‌ గ్రామంలో ఎస్‌ఎస్‌టిటీమ్‌ను సందర్శిచారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ, లోకల్‌ పోలీసులు తనిఖీలు పెంచాలని చూచనలు, సలహాలు అందించారు. ఈ సమీక్షలో మెదక్‌ జిల్లా పరిశ్ర మలశాఖ జనరల్‌ మేనేజర్‌ కష్ణమూర్తి, డీడీ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి అఖిలేష్‌ రెడ్డి, ఈడీఎస్‌ సి కార్పొరేషన్‌ రామా చారి, తహసీల్దార్‌ దేవదాస్‌ ,సెక్టార్‌ అధికారులు, అకౌంటి ంగ్‌ టీం అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love