కంప్యూటర్‌ కోర్సుల్లో రాణించాలి

– లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో అవగాహన
– కాలేజ్‌ సెక్రటరీ రిజ్వానా బేగం
నవతెలంగాణ-గండిపేట్‌
విద్యార్థులు కంప్యూటర్‌ కోర్సులో రాణించాలని లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ సెక్రటరీ రిజ్వానా బేగం అన్నారు. ఆదివారం గండిపేట్‌ మండల్‌ బండ్లగూడ కార్పొరేషన్‌ ఇమేజ్‌ సాగర్‌ లోని లాస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ టెక్నాలజీల పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్‌ కోర్సులు తప్పనిసరన్నారు. కంప్యూటర్‌ పైన విద్యార్థులకు ప్రత్యేక ఈవెంట్‌ కార్యక్రమంలో విద్యార్థులు వత్తి నైపుణ్యంతో పాటు కంప్యూటర్‌ కోర్సు టెక్నాలజీని నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్‌ ఈవెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్న విద్యార్థులను కాలేజ్‌ యజమాన్యం అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ షేక్‌ షావలి, ఉపాధ్యాయులు, కాలేజీ యజమాన్యం, నిర్వాహకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love