కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ బడులు

నవతెలంగాణ-దోమ
‘మన ఊరు-మన బడి’ స్కీంతో ప్రభుత్వ పాఠ శాలలు కార్పొరేట్‌ తరహాలో అయ్యాయని దోమ స ర్పంచుల సంఘం అద్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం’ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘విద్యా దినోత్సవ’ కార్యక్రమంలో భాగంగా జరిగిన జెండా అవిష్కరణ ఆనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి తరగతి గదుల్లో కూర్చోవడానికి నూతన ఫర్నిచర్‌ను పరిశీలించారు. కార్పొరేట్‌ స్కూల్స్‌ నారా యణ, శ్రీ చైతన్య పాఠశాలలకు దీటుగా సీంఎ కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం విద్యార్థులతో గ్రామ పురవీధు ల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బంగ్లా అనిత, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ లక్ష్మయ్య, ప్రధానోపాధ్యాయులు పురాందస్‌, నర్సింలు స్వాతి, గ్రంథాలయ డైరక్టర్‌ యాదయ్య గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love