మేలు రకమైన విత్తనాలతో అధిక దిగుబడి

కంది విత్తనాల చిరుపొట్లాలను అందజేసిన ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
మేలు రకమైన విత్తనాలనాటి మంచి దిగుబడిని పొందాలని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కంది విత్తనాలను రైతులకు అందజేశారు. తాండూరు నియోజవర్గానికి చెందిన వివిధ గ్రామాల రైతులు కంది విత్తనాలను పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజు గౌడ్‌, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్‌ చారి, బషీరాబాద్‌ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్‌), యాలాల్‌ మండల్‌ అధ్యక్షులు సి.రవీందర్‌ రెడ్డి, పెద్దముల్‌ మండల్‌ ఎఫ్‌ఎసిఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, పెద్దముల్‌ మండల్‌ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు ద న్సింగ్‌, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జనార్దన్‌ రెడ్డి, యాలాల్‌ మండల్‌ వైస్‌ ఎంపీపీ రమేష్‌, వికారాబాద్‌ జిల్లా కోఆప్షన్‌ నెంబర్‌ అధ్యక్షులు అక్బర్‌ బాబా, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నా యకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్‌చారి, తాండూర్‌ మం డల్‌ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాములు, జనరల్‌ సెక్రెటరీ రాకేష్‌, యువజన విభాగ అధ్యక్షులు రాజు గౌడ్‌, తాహెర్‌ బాండ్‌, నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్‌ రెడ్డి, పలు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love