గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలివ్వాలి

మౌలిక వసతులు కల్పించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని 75వ సర్వే నెంబర్‌ లో ఉన్న నాలుగు ఎకరాల ఐదు గుంటల భూమిలో 130 రోజులుగా ఇండ్లులేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని భూ పోరాటం చేస్తుంటే, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకుండా ఛోద్యం చూస్తున్నారని విమర్శించారు. నిరుపేదలు 50 గజాల ఇండ్ల జాగాల కోసం పోరాటం చేస్తూంటే, ఎన్నికలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుక్కునే నాయకులు పేదల పక్షాన ఉంటాం, పేదల కోసమే పని చేస్తాం అనే నాయకులకు కంటి నిండా నిద్ర ఏలా పడుతుందని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ బీసీలకు రూ.లక్షా ఇస్తామని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ, క్యాస్ట్‌, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్లు రాక కొన్ని వేల మంది తహసీల్దార్‌ కార్యాలయల చూట్టు తిరుగున్నా ఫలితం లేదన్నారు.ఇప్పటికైనా బీసీలకు ఇచ్చే రూ.లక్షా సహాయం ముగింపు తేదీని పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వకపోతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడి చేస్తామని హెచ్చరించారు. బీజాపూర్‌ జాతీయ రహదారిని కూడా దిగ్బంధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రామస్వామి, ఏఐకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. ప్రభులింగం, కౌన్సిల్‌ సభ్యుడు సుధాకర్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షులు సుభాన్‌ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, పార్టీ చేవెళ్ల మండల కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి ఎండీ మక్బుల్‌, మొయినాబాద్‌ మండల కార్యదర్శి కె. శ్రీనివాస్‌, షాబాద్‌ మండల కార్యదర్శి నక్క జంగయ్య, శంకరపల్లి మండల కార్యదర్శి సుధీర్‌, సీనియర్‌ నాయకులు శౌరీలు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు అంజయ్య, మండల కార్యదర్శి మల్లేష్‌, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల, విజయమ్మ, సాయిలమ్మ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ, బిఓసి మండల కార్యదర్శి శ్రీను పాల్గొన్నారు.

Spread the love