– ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్
కప్పాడు, ఆదిభట్ల పాఠశాలలో అక్షరాభ్యాసం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుం దని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ అన్నారు. మం డల పరిధిలోని కప్పాడులోని ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులకు అక్షరాభ్యాసం చేశారు. అదేవిధంగా ఆదిభట్ల ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరకాల పరమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులుకు అక్షరాభ్యా సం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర భుత్వ పాఠశాలలో డొనేషన్ ఫీజు లేదన్నారు. అడ్మిషన్ ఫీజు వంటికి అసలే లేదన్నారు. ప్రైవేటు మోజులో పడి మోసపోవద్దన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశా లల్లోనే చేర్పించాలని కోరారు. పిల్లల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని ఉన్నత విద్యనందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఒకటి నుండి పదవ తరగతి వరకు ఉచితంగా ప్రభుత్వం గుణాత్మక మైన విద్యను అందిస్తుందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యా యులతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కప్పాడు ఎంపీటీసీ భరత్‌రెడ్డి, సర్పంచ్ హంసమ్మ, ఎంఈఓ వెంక ట్‌రెడ్డి, ఉపసర్పంచ్ మునీర్, రాష్ట్ర సీఎంఓ రామూలు, జిల్లా సీఎంఓ క్రిష్ణ, ఆదిభట్లలో నోడల్ ఆఫీసర్ గోవర్ధన్, ఉపాధ్యాయులు బబ్లీ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు భారతి, ఉపాధ్యాయులు శ్రీధర్, జంగయ్య, అశో క్, రామ్మోహన్, అంగన్వాడీ టీచర్లు బేబీ, సుజాత పాల్గొన్నారు.