మోడీ ప్రభుత్వ తిరోగమనానికి నోట్లరద్దు పరాకాష్ట

– ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్ర
– పెట్టుబడిదారుల రహాస్య ఎజెండాలో భాగమే
– దేశంలో బీజేపీ పతనం ప్రారంభం
– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
నోట్ల రద్దుతో కేంద్రంలో మోడీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహద పడదని ఆయన తేల్చి చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుపై స్పందించారు.ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్‌ పన్నిన పన్నాగమే నోట్లరద్దు చర్యగా ఆయన మండిపడ్డారు. పెట్టుబడిదారుల రహాస్య ఎజెండాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తుందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అని ఆయన తెలిపారు. అసలు రూ.2,000 నోట్లను ఎందుకు తెచ్చారో… ఎందుకు రద్దు చేశారో అన్నది దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయ న్నారు.ఏం ఆశించి ఈ చర్యకు ఉపక్రమిచారనే సర్వత్రా వెలువడుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌పై ఉందన్నారు.నోట్లరద్దు వెనుక ఉన్న బీజేపీ రహాస్యఎజెండాను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.నోట్లరద్దుతో ప్రయోజనం ఉందని భావిస్తే బహిరంగపర్చడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తేల్చి చెప్పాలన్నారు.ఆర్‌బీఐను ముందు పెట్టి ప్రజల కండ్లు గప్పే ప్రయత్నం తప్ప మరోటి కాదని ఆయన మోడీ సర్కార్‌పై మండిపడ్డారు.దేశంలో బీజేపీ ప్రభుత్వం పతనావస్థకు చేరుకుందని మంత్రి విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలీయమైన శక్తిగా బీఆర్‌ఎస్‌ లోకసభ ఎన్నికల నాటికి దేశంలో బీఆర్‌ఎస్‌ బలీయమైన శక్తిగా ఆవిర్బవిస్తుందని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.విజన్‌ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని ఆదరణ ఉందని పేర్కొన్నారు.శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ నమోదు చేసుకున్న విజయంపై ఆయన స్పందించారు.బీఆర్‌ఎస్‌ మహారాష్ట్రలో సృష్టించిన ప్రభుంజనం సెగలు హస్తినను తాకుతున్నాయన్నారు.ఎత్తుగడలో భాగమే కర్నాటక ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉన్నదని వెల్లడించారు.బీఆర్‌ఎస్‌ పోటీలో లేకపోవడమే అక్కడ కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడిందన్న అంశాన్ని విస్మరించొద్దన్నారు.

Spread the love