సీఎం కేసీఆర్ పాలనా చర్యలతో అన్ని వర్గాలలో ఆత్మవిశ్వాసం

– క్రీడా రంగంలోనూ ప్రపంచ చాంపియన్ లుగా రాష్ట్ర యువత
– 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు,75 నియోజకవర్గాల్లో మైదానాలు నిర్మాణం
– తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండల స్థాయి సీఎం కప్-2023 క్రీడా పోటీలను జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జరే భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనా చర్యల ఫలితంగా దశాబ్దకాలం లోపే తెలంగాణ నైపుణ్యాల నేలగా మారిపోయిందని అన్నారు. ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి తో కలిసి కాసేపు వాలీబాల్, కబడ్డీ ఆడి క్రీడా కారులను ప్రోత్సహించారు. రాష్ట్రంలో సీఎం కప్-2023 క్రీడా పోటీలు యువ జాతర్లు గా మారాయని ఆనందం వ్యక్తం చేశారు . సాగు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో కేసీఆర్ ప్రభుత్వం స్వల్ప కాలంలో సాధించిన ప్రగతి, ప్రతి కుటుంబానికి ఆసరాగా మారి ఆత్మ విశ్వాసం పెరిగేలా చేసిందన్నారు. రాష్ట్ర యువతరం భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. మరో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తో పాటు ఐటీ, పారిశ్రామిక రంగంలో లక్షల ఉద్యోగాలు రాష్ట్ర యువతకు దక్కాయని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ప్రణీత్,నిఖత్,త్రిష, శ్రీజ తదితర ఎందరో యువ క్రీడా కారులు ప్రపంచ విజేతలుగా రాణిస్తున్నారని అన్నారు.క్రీడా ఆణిముత్యాలకు భారీ నగదు బహుమతులు, విలువైన ఇళ్ళ స్థలాలు ఇచ్చి సీఎం కేసీఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని వివరించారు. క్రీడలు వర్ధిల్లాలనే లక్ష్యం తోనే 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను సీఎం కేసీఆర్ నిర్మించారని, యువతే కేర్ టేకర్ లలా వాటిని సంరక్షించుకొని,నిత్యం ఆటలతో కళకళలాడేలా చూసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా,ఉద్యోగాలలో క్రీడా కారులకు కల్పించిన రిజర్వేషన్లను విజేతలుగా నిలిచి ఉపయోగించుకోవాలని కోరారు. గుడి, బడి లాగే ప్లే గ్రౌండ్స్ ను గౌరవించాలని యువత కు విజ్ఞప్తి చేశారు. ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ ను చేజిక్కించుకొని భవనగిరి యువత తమ సత్తా చాటాలని ఆకాంక్షించారు. యువత జీవితంలో క్రీడలు కీలకమైనవని ,ఆరోగ్యం తో పాటు గుర్తింపు కూడా క్రీడలతో వస్తుందని వివరించారు. భువనగిరి క్రీడలకు అడ్డా అని, అదే స్పూర్తితో ఆడాలని యువతకు ఎంఎల్ఏ పైళ్ల శేఖర్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, జెడ్పిసిఓ సిహెచ్ కృష్ణ రెడ్డి, డివైఎస్ వో ధనుంజయలు , వైఎస్ ఎంపిపి సంజీవరెడ్డి, నాయకులు చిరబోయిన వెంకటేష్ యాదవ్, ఎంపీటీసీ కృష్ణ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా కా‌రులు,క్రీడా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love