నేటి నుండి 23వరకు ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలలాలోని అన్ని గ్రామ పంచాయతిలలో గ్రామ ప్రత్యేక అధికారులుగా బుధవారం 17 నుండి 23 వరకు పారిశుద్ధ్య వారోత్సవాల నిర్వహణ కొరకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా పలువురిని నియమించాడం జరిగిందని, ప్రత్యేక అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఎంపిడివో లు గోపి బాబు, రాములు నాయక్ లు మంగళవారం వేర్వేరుగా ప్రకటనలో తెలిపారు. కమిషనర్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ ఉపాధి కల్పన హైదరాబాద్, కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో మే మాసంలో నిర్వహించే పారిశుద్ధ్య వారోత్సవాల  నిర్వహణ కు మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, 17 నుండి 23 వరకు జరుగు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహణకు మీకు కేటాయించిన గ్రామ పంచాయతిలో పాల్గొని కలెక్టర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహణకు సంబందించిన రిపోర్ట్ లను గ్రామ కార్యదర్శి ద్వారా మండల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. గ్రామలలో చేత్త లేకుండా, పరిశుభ్రత పాటించే విధంగా ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు.

Spread the love