బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యం

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యమని సర్పంచ్ సక్కారం  అశోక్ అన్నారు. శుక్రవారం మండలంలోని బషీరాబాద్ లో భీంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, మురుపాలు బిడ్డకు అమృతం సమానమని తెలిపారు. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, శంకర్ గౌడ్, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బి.మహేష్, నాయకులు సక్కారం నారాయణ,నెల్ల రమేష్, రాజు, అంగన్వాడీ టీచర్లు మంజుల, అరుణ, సువర్ణ, పద్మ, ప్రణవ, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love