దోస్పల్లి లో అనాధ పిల్లల సర్వే

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్పల్లి గ్రామములో గ్రామ సర్పంచ్ సునితా పటేల్ అధ్వరములో అవాధ పిల్లల సర్వేను అంగన్ వాడి, ఆశాలు చేపట్టడం జర్గిందని జోపిఎస్ జాదవ్ మనోహర్ తెలిపారు. ఈ సంధర్భంగా సర్పంచ్ సునితా పటేల్ మాట్లాడపతు తల్లి దండ్రులు చనిపోయిన పిల్లలు, అనాధలు సంరక్షించేందుకు, వారికి ఉన్నత మైన సదుపాయాలు ప్రభూత్వం ద్వారా కల్పించడం,  ప్రభూత్వం చేస్తుందని, ముందస్తుగా సర్వే చేసి అనాధలుగా వారికి గుర్తించిన అనంతరం వారికి అన్ని రకాలుగా ఆదుకోవడం జర్గుతుందని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పింకుబాయి,  అంగన్ వాడి టీచర్ శైలేజ, ఆశా వర్కర్ బశ్యవ్వ, జీపి సిబ్బంది లక్ష్మన్ తదితరులు పాల్గోన్నారు.

Spread the love