కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

– బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ 
నవ తెలంగాణ-కంఠేశ్వర్
మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని బి.ఎల్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాటర్ సప్లయ్, గార్డెన్స్, స్ట్రీట్ లైట్స్ కార్మికులకు, శానిటేషన్ జవాన్ లకు కనీస వేతనం రూ. 19,500 నైపుణ్యం కలిగిన సిబ్బందికి 22,3850 వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బి ఎల్ టి యు ఆధ్యర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో దండి వెంకట్ మాట్లాడుతూ..మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వాటర్ సప్లయ్, గార్డెన్స్, స్ట్రీట్ లైట్స్ ,కార్మికులకు కనీస వేతనం రూ 19,500, పంప్ ఆపరేటర్ సూపర్ వైజర్స్ లకు 22,500 అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఖమ్మం, రామగుండం ఇతర మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ లో కనీస వేతనం 19,500 సూపర్ వైజర్స్, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ సీనియర్ , జూనియర్ అసిస్టెంట్ల కు 22,500 హెవీ వెహికల్స్ డ్రైవర్ లకు 23, 885 ఇస్తున్నారు.పైన పేర్కొన్న విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే వారికి కూడా అమలు చేయాలని కోరారు. అదేవిధంగా శానిటేషన్ ఔట్ సోర్సింగ్ జవాన్ లకు రూ.22,500 కనీస వేతనం అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బిఎల్ టియు జిల్లా అధ్యక్షులు కె.మధు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, నాయకులు రాహుల్, యాదయ్య, వసంత్ , మురళి, శ్రీశైలం,బి. శంకర్, సహాదేవ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love