నవతెలంగాణ కోదాడరూరల్
కోదాడలో వరస దొంగతనాలతో భయభ్రాంతులకు పట్టణ వాసులు గురవుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాస థియేటర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న లక్ష్మీ ఎలక్ట్రికల్స్ యజమాని బెల్లంకొండ రఘు అనంతగిరి మండలం త్రిపురారం గ్రామంలో తన వ్యవసాయ పొలంలో ఉప్పలమ్మ దేవునికి పెట్టుకునే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అక్కడికి వెళ్లారు. తన బామ్మర్ది మురళి హైదరాబాద్ నుండి కోదాడ లోని ఇంటికి వచ్చి 5 గంటలకు చూసేసరికి తలుపులన్నీ పగలగొట్టి ఉన్నాయి. విషయం గ్రహించిన మురళి తన బావ రఘు కి సమాచారం అందించారు. అప్పటికే తలుపులు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంటిలో దొంగలు పడి సుమారు పది లక్షల రూపాయల నగదు దొంగలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇదే రీతులు పట్టణంలో అనేక దొంగతనాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు గ స్తి పెంచాలని కోరుకుంటున్నారు. ఎవరు ఎవరు లేని ఇండ్లే టార్గెట్ చేస్తూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.