– గాంధీభవన్ ముట్టడిస్తాం
– జడ్పిటిసి సుబ్బురు భీరు మల్లయ్య
నవతెలంగాణ – భువనగిరి రూరల్
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గొల్ల కురుమలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజు నిర్వహించే మహాధర్నాలను జయప్రదం చేయాలని భువనగిరి జడ్పిటిసి సూబ్బురు బీరు మల్లయ్య , యాదవ్ సంఘము జిల్లా అధ్యక్షులు అయోధ్య యాదవ్ లు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ( ప్రెస్ మీట్) నిర్వహించి, మాట్లాడారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు రైతు బజార్ దగ్గర నిర్వహించే మహాధర్నాకు గొల్ల కురుమలు ఎక్కువ సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, చందుపట్ల సర్పంచ్ చిన్నం పాండు, ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు యాదవ్, నాయకులు నక్కల చిరంజీవి యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, కొత్తపల్లి ఆనంద్ యాదవ్, భాత్క అశోక్ యాదవ్ లు పాల్గొన్నారు.