కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

నవతెలంగాణ – హైదరాబాద్‌: కులవృత్తులనే నమ్ముకున్న వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష అందించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గంగుల కమలాకర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, రజక, మేదరి తదితర వర్గాల వారికి సాయం చేయడానికి ఈ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు వివరించారు.

Spread the love