మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలో పలువురు మృతుల కుటుంబాలను గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రానికి చెందిన చెన్న కోటయ్య అనారోగ్యంతో మరియు లక్ష్మీపురం గ్రామానికి చెందిన అల్లం భరత్ రోడ్డు ప్రమాదంలో కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాలను ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందించారు. అలాగే వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

Spread the love