ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

నల్లగొండ,హుజూర్ నగర్ రూరల్ : మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన తురక గోపాల కృష్ణ కు జగ్గయ్య పేట కు చెందిన భవాని తో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది .. ఇప్పటివరకు వారికి సంతానం లేకపోవడం తో తరుచూ భార్య భర్త ల మధ్య గొడవలు జరిగేవి ఈ క్రమంలో గత నెల 29వ తారికున భార్య భర్త ల మధ్య గొడవ జరిగి భార్య తన పుట్టింటికి వెళ్లిపోగా, ఆమెను తీసుకొని వచ్చేందుకు మరుసటి రోజు భర్త గోపాల కృష్ణ తన భార్య భవాని ఇంటికి వెళ్ళగా అక్కడ భవాని మేనమామ దేశగని వెంకటేష్, అప్పమ్మ లు గోపాల కృష్ణ ను తీవ్రంగా అవమానించారు అని, దీనికి తీవ్ర మనస్థాపం చెందిన గోపాల కృష్ణ గురువారం హుజూర్ నగర్ పట్టణ శివారులోని పోతిరేని కుంట పై వేప చెట్టు కు ఉరి వేసుకుని చనిపోయినట్టు మృతి చెందిన గోపాల కృష్ణ తండ్రి మట్టయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Spread the love