తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలి

– తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు  సుమన్ నాయక్…. 
నవతెలంగాణ – చివ్వేంల :–   తెలంగాణ జనసమితి పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో లో లక్ష్మణ్ నాయక్ తండ  లో తెలంగాణ జన సమితి పార్టీ మూడవ  ప్లీనరీ ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్  ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు సుమన్ నాయక్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, పోరాటాల వలన సాధించుకున్న తెలంగాణ ను అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న  కెసిఆర్  పాలన పై విసుగెత్తి నేడు తెలంగాణ ప్రజలు   తెలంగాణ బచావో అంటూ నినదిస్తున్నారని తెలిపారు . కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మనమే కాపాడుకోవాలని ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడిన పార్టీ తెలంగాణ జన సమితి  జూన్ 4 నజరిగే  పార్టీ రాష్ట్ర   ప్లీనరీని విజయవంతం చేయాలని  కోరారు. సూర్యాపేట లో  జగదీష్ రెడ్డి  ని గద్దె దించి తెలంగాణ ఉద్యమకారుడు ధర్మార్జున్ ను గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ జన సమితి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు  మూడ్ మల్సూర్,  విద్యార్థి జన సమితి మండల అధ్యక్షుడు బానోత్ మల్సూర్, రాహుల్, శేషు, నవీన్, సాయి, చంటి తదితరులు పాల్గొన్నారు
Spread the love