– అడ్డుకుంటాం…
– సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి, శ్రీకాంత్ చారి పేరు నామకరణం చేయాలి….
– కేసీఆర్ ను అడ్డుకుంటామని గిరిజన సంఘాల పిలుపు…
– లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ బాలు నాయక్.
నవతెలంగాణ -చివ్వేంల
గిరిజన ప్రజలకు ఎలాంటి హామీలు నెరవేర్చకుండా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న కెసిఆర్ ను అడ్డుకుంటామని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ బాలు నాయక్ డిమాండ్ చేసారు. గురువారం మండల పరిధిలోని వట్టి ఖమ్మం పహాడ్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధరావత్ బాలు నాయక్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి గిరిజన విద్యార్థులకు స్కాలర్ షిప్ మరియు ఫిజు రియాంబర్స్ మెంట్ రాకపోవడం వలన ఉన్నత చదువులకు వెళ్లలేక తీవ్రంగా నష్టపోయిన గిరిజన విద్యార్థులు రాష్ట్రం లో గిరిజన గురుకుల పాఠశాల లో మౌలిక వసతులు లేక బాలికలకు బాత్రూమ్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు . రాష్ట్ర మంత్రి అని చెప్పుకునే ఈ జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజక వర్గం లో కొన్ని తండాలకు బిటి రోడ్లు వచ్చాయని హడావుడి చేసి మోసం చేస్తున్నారన్నారు. ఏ ఒక్క తండాకు కూడా రోడ్లు వేయని దుస్థితి యిప్పుడు వస్తున్న ఎన్నికలో జగదీష్ రెడ్డి ని ఇంటికి పంపియడం ఖాయం అన్నారు. గిరిజన ప్రజలకు డబుల్ బెడ్ రూం, మూడు ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిన కెసిఆర్ ను తగిన బుద్ది చెపుతామని తెలిపారు. ఎన్నికలు వస్తున్న తరుణం లో గృహలక్ష్మి పేరిట కళ్ల బొల్లి మాటలు చెప్పి మోసం చెయ్యాలని చూస్తున్న కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తామని అన్నారు. గిరిజన తెగల మధ్య నెలకొన్న ఘర్షణ ను తక్షణమే నిలవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఒకవైపు గిరిజన తెగల మధ్య ఘర్షణలు రేపుతూనే మరోవైపు వాల్మీకి బోయలను 11 ఓబీసీ కులాలను గిరిజన జాబితాలో కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మునుగోడు బై ఎలక్షన్ సమయం లో గిరిజనులకు గిరిజన బంధు ఇస్తానని చెప్పి మోసం చేసిన కెసిఆర్ ను అడ్డుకుంటామని , సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీసు ను శ్రీకాంత్ చారి పేరు నామకరణం చేయాలని , కెసిఆర్ ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు బానోత్ హరిష్ నాయక్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ నాయక్, మండలఅధ్యక్షులు సేవులు నాయక్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.