నవతెలంగాణ -చివ్వేంల
మండల పరిధిలోని బీబీ గూడెంలో పీపుల్ హోప్ చర్చ్ లో పాస్టర్ ధరావత్ లాకు నాయక్ 42వ పుట్టినరోజు మరియు 25 సంవత్సరాల సేవా పరిచర్య కుగాను సిల్వర్ జూబ్లీ వేడుకను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది .తన పుట్టినరోజు కానుకగా లాకు నాయక్ 120 మంది దైవజనులకు రేడియోలను బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిషప్ సాల్మాన్ రాజు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్,జాన్ మార్క్, గబ్రీయేల్, రూబెన్, గుగులోత్ బాలాజీ నాయక్, డేవిడ్, జలగం జేమ్స్, పంది మార్క్, ధరావత్ సాంసన్ నాయక్, శామ్యూల్, గాజుల రమేష్, 120 మంది పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.