కరోనా కష్టకాలంలో ప్రాణాలను  పణంగా పెట్టి పని చేసిన గ్రామపంచాయతీ కార్మికులు

– ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా..?
– పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి..
– గ్రామ పంచాయతీ కార్మికుల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన సంకినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ- చివ్వేంల: కరోనా కష్టకాలంలో ప్రాణాలను  పణంగా పెట్టి పని చేసిన గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా అని పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఎనిమిదవ రోజు రిలే నిరాహార  దీక్షకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై  సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love