అట్టహాసంగా ప్రారంభమైన సి.యం.ఆర్ షాపింగ్ మాల్..

– జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి, 
– సందడి చేసిన సినీ నటి మృణాల్ ఠాకూర్,
– భారీగా తరలివచ్చిన అభిమానులు.
నవ తెలంగాణ-సూర్యాపేట
వస్త్ర ప్రపంచంలో రారాజుగా పేరుగాంచిన  సీఎంఆర్ 23వ షాపింగ్ మాల్ అంగరంగవైభవంగా ప్రారంభమైంది. మంగళవారం జిల్లా కేంద్రంలో  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సినీ నటి సీతారామ ఫెమ్ మృణాల్ ఠాకూర్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ లు సీఎంఆర్ షాపింగ్ మాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈసందర్భంగా వేద పండితులను ఆశీర్వచనాలతో సన్నాయి మృదంగంతో ఆహుతులకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ స్థాయిలో పట్టణంలో సి.యం. ఆర్ వారు షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో వస్త్రాలు అందించి వారి అభిమానాన్ని చూరగొనాలని కోరారు. సీఎంఆర్ అధినేత మా ఊరు వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వస్త్ర సౌరంభం సూర్యాపేటలో లభిస్తుందని తెలిపారు. ప్రజలు తమకు కావలసిన అన్ని రకాల వేడుకలకు సీఎంఆర్ తగువిధంగా అన్ని మోడల్స్ లో కుటుంబం అంతటికి నచ్చే విధంగా వస్త్రాలు అందించడం సిఎంఆర్ ప్రత్యేకత అన్నారు. సినీనటి మృణాల్  ఠాకూర్ మాట్లాడుతూ సీఎంఆర్ 23వ షోరూం మరింత దినదినాభివృద్ధి చెందాలని ఆకాక్షించారు.అదేవిధంగా షాపింగ్ మాల్ వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందనే నమ్మకం సీఎంఆర్ కల్పిస్తుందన్నారు. ప్రతివారికి సరసమైన ధరలలో అన్ని రకాల వస్త్రాలు సీఎంఆర్ లో లభిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎంఆర్ ను ఆదరించి ప్రజలు షాపింగ్ ను కుటుంబ సమేతంగా చేయాలని కోరారు.  అందరికీ అందుబాటులో ఉన్న ధరలు సి.యం. ఆర్ లో లభిస్తాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మృణాల్ షాపింగ్ మాల్ లో అన్ని ఫ్లోర్లు కలియ తిరుగుతూ సందడి చేశారు. అనంతరం ప్రజలను, వినియోగదారులను, అభిమానులను తన  హావభావాలతో ఆకట్టుకున్నారు.ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ కు చెందిన ఫణి, భాను, రమణమూర్తి ,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి, జ్యోతి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love