ప్రజా సమస్యల పరిష్కారంగా పోరాటాల నిర్వహిస్తున్న సీపీఐ(ఎం)..

– ఈ నెల 21న జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా…
నవతెలంగాణ- భువనగిరి రూరల్ 
రాష్ట్ర రాజధానికి  హైదరాబాద్ నుంచి మూసినది ప్రారంభమై యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకొని, సూర్యాపేట జిల్లాలో కలుస్తుంది. యాదాద్రి జిల్లాలో  ముసినదిని ప్రక్షాళన చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అలసత్వం ప్రదర్శించడం వలన ప్రజలు అనేక శారీరిక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
మూసి ప్రక్షాళన కోసం పోరాటం…
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తున్న జల కాలుష్యాన్ని ప్రక్షాళన చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక దపాలుగా ప్రజా పోరాటాలు నిర్వహించారు. పోరాటం చేసినప్పుడు నిధులు కేటాయిస్తామని ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాలు పబ్బం  గడుతున్నాయననే ఆరోపణలు ఉన్నాయి. గంగానది ప్రక్షాళన కోసం 20,000 కోట్లు కేటాయించినట్లు కోసం నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన సాగు, త్రాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బసవపురం రిజర్వాయర్ ద్వారా కాలువలు చెరువులు నింపి గోదావరి జిల్లాలో లింక్ చేసి జిల్లా ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నగ్న సత్యం. గడిచిన 7,8  సంవత్సరాల కాలంలో సాగుభూమి ఇంటి స్థానాలు ఇచ్చిన దాఖలాలు ప్రభుత్వాలు ఇచ్చిన దాఖలు లేవు. కాగా పేదలకు ఇచ్చిన భూములను  ప్రభుత్వాలు బలవంతంగా లాగేసుకుంటూయని ప్రజలు ఆరోపిస్తున్నారు. త్రిబుల్ ఆర్ పేరుతో బలవంతం భూసేకరణ చేస్తూ, పేదలకు భూములు పంచకుండా, మండలాల్లో భూ పంపిణీ పై నిషేధం విధించారు. గతంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడిన భూములకు పట్టా సర్టిఫికెట్లు ఉన్న భూమి అప్పగించకుండా, రెవిన్యూ శాఖ అధికారులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీ చేస్తావని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి లో  ఎక్కడ కూడా అమలు కాకపోవడం. గృహ లక్ష్మీ పథకం సామాజిక తరగతులకు ఇచ్చే ఆర్థిక సహకారాన్ని రాజకీయ జోక్యం  లేకుండా గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చిన్న నీటి వనరులను పట్టించుకోని ప్రభుత్వాలు…
చిన్న నీటి వనరులైన బునాది గాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి పల్లి కాలువ దశాబ్దాలు గడుస్తున్న ఒక అడుగు ముందుకు , రెండు అడుగులు వెనుకకు  ఆన చందంగా పనులు కొనసాగుతూ  సంపూర్తిగా మిగిలిపోయాయి. బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పెట్టిన గడువులు ముగిసిపోగా అనేకసార్లు ప్రాజెక్టు గడువును పొడిగించిన దాఖలాలు ఉన్నాయి. ఆయినప్పటికి పూర్తి కాకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది, పాలకుల నిర్లక్ష్యం, సకాలములో పనులు పూర్తి కాక పోవడం మరొక కారణం. ఆలేరు నియోజకవర్గం సంబంధించి గందమల్ల రిజర్వాయర్  మొదట్లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పేరును ఎక్కడ కూడా ఊచరించని పరిస్థితి నెలకొంది. సంస్థన్ నారాయణపురం మండలం కు నీరు అందించేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పై స్పష్టత లేదు. భువనగిరి మండలం వడపర్తి గ్రామం వద్ద కత్వా కాల్వ లోకి నీరు అందించి, భువనగిరి ప్రాంతానికి గోదావరి  జిల్లాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో కాలుష్య సమస్యలు… యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ కేంద్రానికి దగ్గర ఉండటంతో ఇండస్ట్రీల వలన వాయు కాలుష్యం ఏర్పడుతుంది. భువనగిరి, బీబీనగర్,చౌటుప్పల్  మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గతంలో కాలుష్యకారక నీటిని శుభ్రం చేయకుండా బోర్లు వేసి, డైరెక్ట్ గా భూగర్భ జలాలను కలుషితం చేసిన దాఖలాలు జిల్లా ప్రజలకు విదితమే.
సమస్యలపై సమర శంఖారావం…
సీపీఐ(ఎం) పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల సమస్యలపై శంఖారావం పూరిస్తూ ఈనెల 21వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ధర్నాకు పిలుపునిచ్చింది.
సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్స్…
గతంలో ఇంటి స్థలాలకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేసి, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సహాయం అందజేయాలి. ఇళ్ల స్థలాలు లేని వారికి 125 గజాల స్థలాన్ని ఇవ్వాలి. అవకాశం ఉన్న కేంద్రాలను గుర్తించి పేదలకు సాగు భూమిని పంపిణీ చేయాలి. భూ పంపిణీ నిషేదని చేయాలి. భూ సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలనూ పరిష్కరించాలి. ముసినది ప్రక్షాళనకు గంగానది ప్రక్షాళన తరహలో కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి. మూసి పరివాహక ప్రాంతంలో జల కాలుష్యం బారి నుండి కాపాడడానికి కాళేశ్వరం ప్రాజెక్టు (బస్వాపురం రిజర్వాయర్) ద్వారా భూనాదిగాని కాలువ, భీమ లింగం, దర్మా రెడ్డిపల్లి, అసిఫ్ నహార్ కాలువలోకి గోదావరి జిల్లాలను మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ పట్టణానికి మీరు అందించే పనులను వెంటనే చేపట్టాలి. బసవపురం ప్రాజెక్టు పనులకు నిర్మిత గడుపు పెట్టి, యుద్ధ ప్రాతిపదికన పనులు  పూర్తి చేయాలి. గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణం పై సీఎం ప్రకటన చేసి నిధులు మంజూరు చేయాలి. ఆలేరు ప్రాంతానికి నీరు అందించాలి. చిన్న నీటి వనరులపై నిర్లక్ష్యం వీడి, మరమతులు చేపట్టాలి. వర్షాలు వలన ప్రజల రాకపోకలకు ప్రమాదకరంగా మారిన చోటా నూతన కల్వర్టు,బ్రిడ్జి లను నిర్మించాలి. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ,పిజి  కళాశాలలు ఏర్పాటు చేస్తూ, చౌటుప్పల్ లో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలి. జిల్లాలో ఏయిమ్స్ అధ్వర్యంలో  సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి, సంచార వైద్యం ద్వారా విస్తృత సేవలు అందించాలి. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిని విస్తరనతో పాటుగా,  300 పడకల ఆసుపత్రిగా మార్చాలి. ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఆస్పత్రులను ఏరియా ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలి. గృహలక్ష్మి పథకం సామాజిక తరగతులకు ఇచ్చే ఆర్థిక సహకారాన్ని గ్రామసభల ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేయాలి. ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. యాదగిరిగుట్ట చూట్టు వెలసిన వెంచర్లలో గ్రామపంచాయతీ అవసరాలకు కేటాయించిన పది శాతం భూములలో పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి  ఇవాలి. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ 5 ఎమ్మెల్యేలతో కలిసి  అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి… సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్… జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అయిదుగురు ఎమ్మెల్యేలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఎన్నికల కోసం హడావిడి చేస్తుండగా కేవలం సిపిఎం పార్టీ మాత్రమే ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కార కోసం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఎం ఒక విజన్ పోరాటం చేస్తుందని, కలెక్టర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు తెలిపారు. కాగా నూతన జిల్లా మౌలిక రంగంలో వెనుకబాటుకు గురవుతుందని, యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగునీరు అభివృద్ధికి కీలకమని సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వాహిస్తున్నాయని అన్నారు. కరువు ప్రాంతమైన సంస్థ నారాయణపురం మండలానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల  పథకం ద్వారా నీటిని అందించాలని , ప్రభుత్వం డిపిఆర్ ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ గడవల ప్రాజెక్టు గురించి స్వయంగా ప్రకటించిన ఇప్పటివరకు అతిగతి లేదన్నారు. చిన్న నీటి కాలువ వనరులైన భూనాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాల్వ , ఫిలాయి పెల్లి కాలువ పనులు రెండు దశాబ్దాలుగా ఆసంపూర్తిగా పూర్తవుతున్నాయని దీనికి ప్రభుత్వాలు సరియైన నిధులు కేటాయించకపోవడమే కారణమన్నారు. మూసి కాలువ నీటిపై జిల్లాలోని భువనగిరి, పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్ ఈ ఆరు మండలాలతో పాటు, మోత్కూర్ ఆత్మకుర్ మండలాలలోని కొన్ని గ్రామాలు పరోక్షంగా ఆధారపడి ప్రజల జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం గంగానది ప్రక్షాళనకు కేటాయించినట్లు, మూసి నదికి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్వాపురం రిజర్వాయర్  ద్వారా చిన్న నీటి వనరులకు లింకు చేసి గోదావరి జిల్లాలను అందించాలని కోరారు.
Spread the love